మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. రెండు లక్షల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు..

|

Mar 22, 2021 | 12:21 AM

Maharashtra new COVID-19 cases: దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజూకూ భారీగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. రెండు లక్షల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు..
Coronavirus
Follow us on

Maharashtra new COVID-19 cases: దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజూకూ భారీగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నిత్యం రికార్డు స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 30,535 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 99 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,79,682 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 53,399 కి చేరింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 11,314 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 22,14,867 కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 2,10,120 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి.

Also Read:

రాజస్థాన్‌లో విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లల మృతి

ICAI CA Final Result Jan 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి