కరోనా “మహా’విలయం..కొత్తగా 8,308 పాజిటివ్ కేసులు,200లకు పైగా మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. జడలు విప్పుకుంటున్న మహమ్మారి రోజురోజుకూ మరింత వికృత రూపం ప్రదర్శింస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య మిలియన్ మార్క్ దాటేసింది. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా

కరోనా మహా'విలయం..కొత్తగా 8,308 పాజిటివ్ కేసులు,200లకు పైగా మరణాలు
Follow us

|

Updated on: Jul 17, 2020 | 9:32 PM

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. జడలు విప్పుకుంటున్న మహమ్మారి రోజురోజుకూ మరింత వికృత రూపం ప్రదర్శింస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య మిలియన్ మార్క్ దాటేసింది. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా మహరాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు రికార్డ్‌లు బ్రేక్‌ చేస్తూనే ఉంది. శుక్రవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు మహారాష్ట్రలో కొత్తగా 8,308 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 258 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,589 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా బారిన పడి మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 11,452 చేరిందని ప్రభుత్వం పేర్కొంది.