Corona Effect On Hyderabad Metro: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఆర్థిక వ్యవస్థను సైతం తీవ్రంగా దెబ్బతీస్తోంది. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు లాకడౌన్ విధిస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థపై కుంటుపడుతోంది. ఇక తెలంగాణలో ఉదయం 4 గంటలు సడలింపులు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు మాత్రం పుంజుకోవడం లేదు. రవాణ వ్యవస్థపై కూడా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ మెట్రో సేవలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమల్లోకి తేవడం, పరిమిత సమయంలోనే మెట్రో సేవలు అందుబాటులో ఉండడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.
ఇక ఒకప్పుడు మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 4 వేలకు పడిపోవడం గమనార్హం. దీన్ని బట్టే కరోనా ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మెట్రోపై కరోనా ప్రభావం.. కరోనా ప్రారంభమైన నాటి నుంచి కనిపిస్తూనే ఉంది. కరోనా ముందు మెట్రలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణించగా.. కరోనా తొలి వేవ్ తర్వాత పునఃప్రారంభంలో రోజుకు 2.20 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకున్నారు. ఇక నైట్ కర్ఫ్యూ విధించిన తర్వాత ఈ సంఖ్య 1 లక్షకు పడిపోయింది. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య 4 వేలకు చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను నెలాఖరుకు వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మెట్రో అధికారులు సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. నష్టాలు వస్తుండడంతో లాక్‌డౌన్‌లో మెట్రో నడపాలా వద్ద అన్న దిశలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు డబ్బు పిచ్చి ఎక్కువేనట.. ఇదిగో ప్రూఫ్ అంటున్న అమెరికా మీడియా