భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

తాజాగా ఓ భార‌త క్రికెట్ ఆట‌గాడికి కూడా ఈ వైర‌స్ సోకింది. టీమిండియా క్రికెట‌ర్ క‌రుణ్‌ నాయ‌ర్‌కు క‌రో‌నా పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క‌ర్నాట‌కకి చెందిన క‌రుణ్ నాయ‌క‌ర్.. భార‌త్ త‌ర‌పున ఆరు టెస్టులు, రెండు వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. కాగా క‌రుణ్ నాయ‌ర్‌కి కోవిడ్ సోకిన విష‌యాన్ని..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2020 | 4:47 PM

దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంతో మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ, క్రీడా ప్ర‌ముఖులు ఈ వైర‌స్ బారిన పడుతూనే ఉంటున్నారు. సామాన్యుల‌తో పాటు వీరికి కూడా కోవిడ్ సోక‌డం ప్ర‌జ‌లను ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. ఇప్ప‌టికే రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్‌ పాజిటివ్ కేసుల విష‌యంలో భార‌త్ 3వ స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం భార‌త‌దేశ వ్యాప్తంగా 23,96,637 కేసులు న‌మోదుకాగా 47,033 మంది మృతి చెందారు.

తాజాగా ఓ భార‌త క్రికెట్ ఆట‌గాడికి కూడా ఈ వైర‌స్ సోకింది. టీమిండియా క్రికెట‌ర్ క‌రుణ్‌ నాయ‌ర్‌కు క‌రో‌నా పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క‌ర్నాట‌కకి చెందిన క‌రుణ్ నాయ‌క‌ర్.. భార‌త్ త‌ర‌పున ఆరు టెస్టులు, రెండు వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. కాగా క‌రుణ్ నాయ‌ర్‌కి కోవిడ్ సోకిన విష‌యాన్ని అత‌నితో పాటు, క‌ర్నాట‌క క్రికెట్ అసోషియేష‌న్ కూడా గోప్యంగా ఉంచింది. అయితే తాజాగా క‌రుణ్ క‌ర‌నా నుంచిపూర్తిగా కోలుకున్నాడ‌ని.. ఇటీవ‌లే నిర్వ‌హించిన అత‌నికి కోవిడ్ టెస్టుల్లో నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డైంది. దీంతో ఐపీఎల్ 2020 సీజ‌న్ కోసం కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టులో అత‌ను త్వ‌ర‌లోనే చేరేందుకు మార్గం సుగ‌మ‌మైంది.

Read More:

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu