హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..

|

Apr 29, 2020 | 4:50 PM

సాధారణంగా లాక్ డౌన్ సమయంలో ఎవరైనా సంపన్న వర్గానికి చెందినవారు బాధితులుగా మారితే… వారికి ఇచ్చే ప్రాధాన్యత.. సామాన్యుల విషయంలో అసలు ఉండదు. అయితే ఇందుకు భిన్నంగా ఏపీలో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా చాలామంది ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. అలాంటివారు ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. తొలుత 21 రోజులు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు మే 3 వరకు పొడిగించడం.. అలాగే రానున్న […]

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..
Follow us on

సాధారణంగా లాక్ డౌన్ సమయంలో ఎవరైనా సంపన్న వర్గానికి చెందినవారు బాధితులుగా మారితే… వారికి ఇచ్చే ప్రాధాన్యత.. సామాన్యుల విషయంలో అసలు ఉండదు. అయితే ఇందుకు భిన్నంగా ఏపీలో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా చాలామంది ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. అలాంటివారు ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. తొలుత 21 రోజులు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు మే 3 వరకు పొడిగించడం.. అలాగే రానున్న రోజుల్లో లాక్ డౌన్ మరిన్ని రోజులు అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో.. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.

కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది వలస కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం గుంటూరు జిల్లాకు వచ్చారు. ఇక కరోనా పుణ్యమా అని వారంతా సొంతూళ్ళకు వెళ్ళలేక జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరంతా తాజాగా ప్రత్తిపాడులో పర్యటించిన ఏపీ హోంమంత్రి మేకపాటి సుచరితకు తమ గోడును వినిపించారు. ఊరు కానీ ఊళ్లో తిండి తిప్పలు లేక కష్టాలు పడుతున్నామని.. వృద్దులను, పిల్లలను సొంత ఊరిలో వదిలేసి వచ్చామని.. తమను ఎలాగైనా తమ ఊళ్లకు పంపాలంటూ ప్రాధేయపడ్డారు. దీనితో సుచరిత ఉన్నపళంగా ఉన్నతాధికారులతో మాట్లాడి.. వలస కూలీలను వారి స్వస్థలానికి పంపేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కోసిగి, దేవరకొండ మండలాలకు చెందిన వలస కూలీల కోసం 8 బస్సులను, మల్లయపాలెంలో 9 బస్సులు, వంగిపురంలో 5, ప్రత్తిపాడులో 3, మేడవారిపాలెంలో 2 బస్సులను ఏర్పాట్లు చేశారు. కాగా, హోంమంత్రి చొరవతో వారివారి స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

Read More: 

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..