ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కుంభమేళాకు వెళ్లొచ్చిన ఓ మహిళ.. మొత్తం 33 మందికి కరోనా అంటించింది. బెంగళూరుకు చెందిన 67 ఏండ్ల మహిళ ఇటీవల జరిగిన కుంభమేళాకు వెళ్లొచ్చింది. అక్కడ్నుంచి వచ్చిన కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. టెస్టు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ మహిళతో పాటు ఆమె కుటుంబంలోని మరో 18 మందికి కరోనా వ్యాపించింది. సదరు మహిళా వెస్ట్ బెంగళూరులోని స్పందన హెల్త్‌కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో సైక్రియాటిస్టుగా పని చేస్తోంది. ఆ సెంటర్‌లో ఉన్న 13 మంది రోగులతో పాటు ఇద్దరు సిబ్బందికి సైక్రియాటిస్టు నుంచి కరోనా వ్యాపించింది. అలా మొత్తం 33 మందికి కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. 67 ఏండ్ల మహిళ నివాసంతో పాటు ఆ పరిసరాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.
కుంభమేళాకు లక్షల మంది వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా వ్యాపించిందని ఆందోళనలు నిజమవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, తెహ్రి, డెహ్రాడూన్ జిల్లాల్లో మొత్తం 670 హెక్టార్ల మేర కుంభమేళ జరిగింది. కొన్ని లక్షల మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేశారు. వీళ్లలో చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.
Also Read: అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా.. ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్