కిమ్ క్రూరత్వానికి నిదర్శనం.. పారిపోవాలని చూసిన వాళ్లకు ఉరితీత..

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. కొడుకుని తన తండ్రి దగ్గడకు చేర్చాలని చూసిన ఓ జంటను నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు చేసి చంపేశాడు ఈ నార్త్ కొరియా […]

కిమ్ క్రూరత్వానికి నిదర్శనం.. పారిపోవాలని చూసిన వాళ్లకు ఉరితీత..
Follow us

|

Updated on: May 27, 2020 | 1:34 PM

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. కొడుకుని తన తండ్రి దగ్గడకు చేర్చాలని చూసిన ఓ జంటను నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు చేసి చంపేశాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 50 ఏళ్ల భార్యాభర్తలు ఇటీవల దేశ సరిహద్దులు దాటి చైనా పారిపోవాలని అనుకున్నారు. తన సోదరుడి కొడుకు(14)ను అతడి కుటుంబంతో చేర్చాలనే ఉద్దేశ్యంతో వారు నార్త్ కొరియా సరిహద్దులు దాటి చైనాలోకి ప్రవేశించి.. ఆ తర్వాత దక్షిణ కొరియా వెళ్ళాలనుకున్నారు. కొద్దికాలం క్రితం ఆమె సోదరుడు నార్త్ కొరియా నుంచి పారిపోయి సౌత్ కొరియాలో స్థిరపడ్డాడు. అయితే అతని కొడుకు మాత్రం వీరి దగ్గరే ఉండిపోయాడు. ఇటీవల కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలన్నీ పూర్తిగా దెబ్బతినడంతో నార్త్ కొరియా నుంచి వెళ్ళిపోవాలని ఆ జంట నిర్ణయించుకున్నారు.

అనుకున్నట్లుగానే అంతా సిద్దం చేసుకుని మేనల్లుడితో పాటు రహస్యంగా ర్యాంగాంగ్‌లోని చైనా సరిహద్దుకు చేరుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న బోర్డు సెక్యూరిటీ వాళ్లకు పట్టుబడ్డారు. అంతే ఇంకేముంది సైన్యం ఆ జంటను చిత్రహింసలకు గురి చేసి నిజం ఒప్పుకునేలా చేశారు. తమ మేనల్లుడిని తన తండ్రి దగ్గరకు చేర్చలనుకున్నామని.. అంతకు మించి మేము ఏ తప్పు చేయలేదని వారు ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. కిమ్ సిఫార్సుతో ఆ ఇద్దరినీ ఫైరింగ్ స్క్వాడ్ ఉరి తీసి చంపేశారు. బాలుడు మైనర్ కావడంతో అతడిని లేబర్ క్యాంపుకు తరలించారు. ఇక ఈ విషయం బయటికి రావడంతో నార్త్ కొరియా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నార్త్ కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో ఇలా సైన్యం చేతుల్లో హతమైన వారు ఇప్పటికే చాలామంది ఉన్న విషయం విదితమే.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..