ఈ నెల 18న ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి క‌ర్ర‌పూజ‌

ఈ నెల 18న ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి క‌ర్ర‌పూజ‌

భాగ్య‌న‌గ‌రంలో ఓ వైపు క‌రోనా వ్యాప్తి విస్త‌రిస్తోంది. మ‌రోవైపు అప్పుడే గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల‌కు సంబంధించిన ప‌నులు ప్రారంభ‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌లోనే అత్యంత విశిష్ట‌త క‌లిగిన ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ప్ర‌తిష్టాప‌న కోసం ప‌నులు మొద‌లుపెట్టేందుకు నిర్వాహ‌కులు మూహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 18నుంచి ప‌నులు ప్రారంభించ‌నున్నారు.   ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి […]

Jyothi Gadda

| Edited By: Anil kumar poka

May 12, 2020 | 1:02 PM

భాగ్య‌న‌గ‌రంలో ఓ వైపు క‌రోనా వ్యాప్తి విస్త‌రిస్తోంది. మ‌రోవైపు అప్పుడే గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల‌కు సంబంధించిన ప‌నులు ప్రారంభ‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌లోనే అత్యంత విశిష్ట‌త క‌లిగిన ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ప్ర‌తిష్టాప‌న కోసం ప‌నులు మొద‌లుపెట్టేందుకు నిర్వాహ‌కులు మూహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 18నుంచి ప‌నులు ప్రారంభించ‌నున్నారు.

ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి ప్రారంభించే పనులను ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu