కేరళలో కొత్తగా మరో 10 పాజిటివ్ కేసులు..
కేరళ రాష్ట్రంలో గురువారం కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 447కు పెరిగింది. గురువారం ఎనిమిది మంది బాధితులు కరోనాను జయించి బయటపడ్డారని సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 316 మంది కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక గురువారం నమోదైన కేసుల్లో.. నలుగురు ఇతర రాష్ట్రాల వారికి వచ్చిందని.. ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన వారని తెలిపారు. ఇక మరో నలుగురికి ఇతరుల […]

కేరళ రాష్ట్రంలో గురువారం కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 447కు పెరిగింది. గురువారం ఎనిమిది మంది బాధితులు కరోనాను జయించి బయటపడ్డారని సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 316 మంది కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక గురువారం నమోదైన కేసుల్లో.. నలుగురు ఇతర రాష్ట్రాల వారికి వచ్చిందని.. ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన వారని తెలిపారు. ఇక మరో నలుగురికి ఇతరుల ద్వారా కరోనా సోకిందన్నారు. అయితే ఎయిర్‌పోర్టులన్నీ మూసివేసి.. నెల రోజులైందని.. నెల రోజుల క్వారంటైన్ తర్వాత కూడా విదేశాల నుంచి వచ్చిన వారికి ఇప్పుడు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగుతోంది. దీంతో వైద్యులు ఈ విషయంపై దృష్టిసారించారు. దీనిని కనుగొనేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 129 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇద్దరు చనిపోయారు.