కరోనా ఎఫెక్ట్: వీడియోకాల్‌లో తండ్రి అంత్యక్రియలు

కేరళకు చెందిన లినో అబెల్ అనే యువకుడు..ఉద్యోగ రీత్యా ఖతార్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన తండ్రికి గుండెపోటు రావటంతో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో విషయం తెలుసుకున్న లినో అబెల్..

కరోనా ఎఫెక్ట్: వీడియోకాల్‌లో తండ్రి అంత్యక్రియలు
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 16, 2020 | 7:40 AM

కరోనా వైరస్ ఎంతో మంది జీవితాల్లో విషాదం నింపింది. ఈ వైరస్ బారిన పడ్డబాధితుల కన్నీటి కథలు చాలానే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితంలో చైనాలో ఇద్దరు వ‌ృద్ధ దంపతులకు వైరస్ సోకింది. దాంతో వారిని ఆస్పత్రిలోని పక్కపక్క బెడ్లమీదనే ఉంచి చికిత్స అందజేశారు. చికిత్స సమయంలో వారు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. అదిచూసిన నెటిజన్లు ఆ దంపతుల అన్యోన్యతకు చలించిపోయారు. మరోకేసులో వైరస్ సోకిన తల్లిని అద్దాలు అడ్డుపెట్టి కన్నబిడ్డకు చూపించిన వైనం కూడా అందరిని కంటతడి పెట్టించింది. తాజాగా అటువంటిదే మరో విషాద సంఘటన కేరళలో చోటు చేసుకుంది.

కేరళకు చెందిన లినో అబెల్ అనే యువకుడు..ఉద్యోగ రీత్యా ఖతార్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన తండ్రికి గుండెపోటు రావటంతో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో విషయం తెలుసుకున్న లినో అబెల్.. ఆసుపత్రిలో చేరిన తన తండ్రిని చూడడానికి ఖతార్‌ నుంచి కేరళకి వచ్చాడు. కరోనా వైరస్ ప్రభావిత దేశాలలో ఒకటైన ఖతార్ నుండి మార్చి 8 న వచ్చాడు లినో అబెల్..ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా, అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించారు. దీనితో ఎవరికీ తెలియకుండా కొట్టయాంలోని తన తండ్రి ఉన్న ఆసుపత్రికి చేరుకున్నాడు. కానీ, తనకు సోకిన వైరస్ ఎంతటి ప్రమాదకారో తెలుసుకున్నాడు. తనవల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భావించాడు.. మరో మారు అక్కడ వైద్యులను సంప్రదించాడు. .అక్కడ మళ్ళీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అతన్ని ఐసోలేషన్‌ వార్డుకు చేర్చారు.

ఆ మరుసటి రోజునే అతని తండ్రి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అబెల్‌ తన తండ్రి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి అంబులెన్సులో తరలిస్తున్న దృశ్యాన్ని కిటికీలో నుంచి చూసి కన్నీటి పర్యంతం అయ్యాడు. తండ్రి చివరి చూపు చూడలేకపోయాననే బాధతో కుమిలికుమిలిపోయాడు. చివరకు ఆసుపత్రి సిబ్బంది ఇతని పరిస్థితి గమనించి..చలించిపోయారు. తండ్రి అంత్యక్రియలను చూపించాలని నిర్ణయించారు. వీడియో కాల్ ద్వారా..చివరి కర్మను అబెల్ చూడగలిగాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..