కర్ణాటకలో సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ 5వేలకు పైగానే

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,985 కరోనా పాజిటివ్‌ కేసులు..

  • Tv9 Telugu
  • Publish Date - 4:56 am, Mon, 10 August 20
కర్ణాటకలో సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ 5వేలకు పైగానే

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,78,087కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 93,908 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,973 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇదిలావుంటే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 3,198 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు అర్బన్‌లోనే నమోదవుతున్నాయి. దీంతో అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే సీఎం, మాజీ సీఎం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కూడా కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు