AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రీంన‌గ‌ర్ పోలీసుల స‌రికొత్త ప్ర‌యోగం…న్యూ టెక్నాల‌జీతో లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించాలనే లక్ష్యంగా క‌రీంన‌గ‌ర్ పోలీసులు స‌రికొత్త ప్ర‌యోగంతో ముందుకు క‌దులుతున్నారు. నూత‌నంగా అందుబాటులోకి వ‌చ్చిన ..

క‌రీంన‌గ‌ర్ పోలీసుల స‌రికొత్త ప్ర‌యోగం...న్యూ టెక్నాల‌జీతో లాక్‌డౌన్‌
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2020 | 1:20 PM

Share

కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించాలనే లక్ష్యంగా క‌రీంన‌గ‌ర్ పోలీసులు స‌రికొత్త ప్ర‌యోగంతో ముందుకు క‌దులుతున్నారు. నూత‌నంగా అందుబాటులోకి వ‌చ్చిన మోబైల్ క‌మాండ్ కంట్రోల్ వాహ‌నంతో లాక్‌డౌన్ విధులు నిర్వ‌రిస్తూ మంచి ఫ‌లితాలు సాధిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే…

ఇప్ప‌టికే టెక్నాలజీ వినియోగంతో ముందుకుసాగుతున్న కరీంనగర్ కమీషనరేట్ పోలీసులకు మరో సాంకేతిక ఆస్త్రం అందుబాటులోకి వచ్చింది. శాంతిభద్రతలకు భంగం కలిగే చర్యలు జరిగిన సందర్భాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కు నూతనంగా మోబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం అందుబాటులోకి వచ్చింది. మార్చి 28నే ఈ వాహ‌నాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌గా, ఇప్పుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో దానిని వినియోగించుకుంటున్నారు.
మోబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంలో ప్రజలకు తగు జాగ్రత్తలు, సూచనలు, హెచ్చరికలు చేసేందుకు ఆప్లి ఫైర్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీని ద్వారా ప్రజలకు ఈ వాహనంలోని మైకుల ద్వారా తెలియపర్చడం జరుగుతుంది. ప్రస్తుతం కోవిడ్ -19 నేపథ్యంలో లాక్ డౌన్ కార‌ణంగా  సాయంత్రం 7గంటల నుండి ఉదయం 6గంటల వరకు కర్ప్యూ నిర్వహిస్తుడటంలో ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు.  ఈ వాహనంలో మూడు కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇందులో ఒకటి పిటిజడ్ 360 డిగ్రీలలో తిరుగుతూ ఉంటుంది. మరో రెండు కెమెరాలు చుట్టుపక్కల జరిగే వివిధ రకాల చర్యలను రికార్డు చేస్తుంది.  లాక్ డౌన్, కర్ప్యూ ఆదేశాలను ధిక్కరించే వారి కదలికలను గుర్తించేందుకు పిటిజడ్ కెమెరా, చుట్టుపక్కల ప్రాంతాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారి దృశ్యాలు రికార్డ్‌ చేయబడ‌తాయి. లాక్‌డౌన్ ఆదేశాలను ఉల్లఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఈ దృశ్యాల‌ను ఆధారంగా వాడుకుంటారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో అత్యంత ఆధునిక సాంకేతికతో కూడిన ఈ వాహనం సేవలను వినియోగిస్తున్నారు. 24 గంట‌ల‌పాటు ఈ వాహనంతో వేగవంతంగా సేవలందించే వివిధ విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు , సంబంధిత అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇందులో విహెచ్ఎఫ్ సెట్ కూడా అమర్చబడి ఉంది. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు, సదరు ప్రాంతాల నుండి వచ్చే సమాచారానికి సత్వరం స్పందించి సేవలందిస్తారు.