AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ అప్పు మొత్తం తీర్చేస్తా.. నా ఆస్తుల్ని వదలండి ప్లీజ్.. లిక్కర్ కింగ్ ట్వీట్‌..

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గురించి చెప్పక్కర్లేదు. బ్యాంకులను మోసగించి.. దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉంటున్నా.. తరచూ ట్వీట్స్ చేస్తూ.. అందరికీ టచ్‌లోనే ఉంటున్నారు. తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో మంగళవారం రోజు వరుస ట్వీట్లు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్ వేళ పెంపుడు జంతువులతో ఆడుకుంటూ ఇంటి సమయాన్ని ఆస్వాదించండని. తాను కూడా తన పెంపుడు జంతువులతో ఆడుకుంటూ.. […]

మీ అప్పు మొత్తం తీర్చేస్తా.. నా ఆస్తుల్ని వదలండి ప్లీజ్.. లిక్కర్ కింగ్ ట్వీట్‌..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 31, 2020 | 2:43 PM

Share

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గురించి చెప్పక్కర్లేదు. బ్యాంకులను మోసగించి.. దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉంటున్నా.. తరచూ ట్వీట్స్ చేస్తూ.. అందరికీ టచ్‌లోనే ఉంటున్నారు. తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో మంగళవారం రోజు వరుస ట్వీట్లు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ లాక్‌డౌన్ వేళ పెంపుడు జంతువులతో ఆడుకుంటూ ఇంటి సమయాన్ని ఆస్వాదించండని. తాను కూడా తన పెంపుడు జంతువులతో ఆడుకుంటూ.. కాలక్షేపం చేస్తున్నానంటూ ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. పుల్వామా, కార్గిల్‌లో లాగా కాకుండా.. ఇప్పుడు తెలియని శత్రువుతో ఫైట్ చేస్తున్నామని.. అంతా ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.

ఇక మరో ట్వీట్‌లో తన అప్పుల గురించి.. బ్యాంకులు, ఈడీ గురించి ప్రస్తావించారు. ఇండియన్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులన్నింటినీ వంద శాతం చెల్లిస్తానంటూ పేర్కొన్నారు. అయితే బ్యాంకులు తన విన్నపాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. అటు ఈడీ కూడా పట్టించుకోవడం లేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. జప్తు చేసిన ఆస్తులను కూడా రిలీజ్‌ చేయడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి జోక్యం చేసుకోవాలంటూ ట్వీట్‌లో తన గోడుచెప్పుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న.. ఈ సమయంలోనైనా తన విన్నపాన్ని అర్ధం చేసుకోండంటూ ట్వీట్టర్‌ ద్వారా పోస్ట్ చేశారు.

Important to stay safe and maintain social distancing which can effectively be achieved by staying home and enjoying home time with family and pets. I am doing the same. We all have a sense of bravado but it’s not worth challenging an unknown enemy which isn’t Pulwama or Kargil.

— Vijay Mallya (@TheVijayMallya) March 31, 2020