రంజాన్ వేళ.. ముస్లింలకు తీపి కబురు.. ఏపీలో కొన్ని సడలింపులు..

ఒకవైపు లాక్‌డౌన్‌…మరోవైపు రంజాన్‌ ప్రార్థనలు.. ఈ నేపథ్యంలో ప్రత్యేక సడలింపులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 721ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం చాలా పరిమితంగా మాత్రమే మసీదులలో ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంటుంది. మసీదుల్లో ఉండే ఇమామ్‌, మౌజంతో పాటు మరో ముగ్గురు కమిటీ సభ్యులకు మాత్రమే మసీదుల్లోకి అనుమతి ఉంటుంది. మిగిలినవారు ఎవరి ఇళ్లల్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇమాం, మౌజంలకు […]

రంజాన్ వేళ.. ముస్లింలకు తీపి కబురు.. ఏపీలో కొన్ని సడలింపులు..
Follow us

|

Updated on: Apr 25, 2020 | 12:03 PM

ఒకవైపు లాక్‌డౌన్‌…మరోవైపు రంజాన్‌ ప్రార్థనలు.. ఈ నేపథ్యంలో ప్రత్యేక సడలింపులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 721ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం చాలా పరిమితంగా మాత్రమే మసీదులలో ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంటుంది. మసీదుల్లో ఉండే ఇమామ్‌, మౌజంతో పాటు మరో ముగ్గురు కమిటీ సభ్యులకు మాత్రమే మసీదుల్లోకి అనుమతి ఉంటుంది. మిగిలినవారు ఎవరి ఇళ్లల్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇమాం, మౌజంలకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. రోజూ అయిదుసార్లు ప్రార్థనలు చేసుకోవచ్చని జీవోలో పేర్కొంది. మరోవైపు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. మసీదుల దగ్గర బ్యానర్లు కట్టాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. ఉపవాస దీక్షల నేపథ్యంలో పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక సడలింపులు ఇచ్చింది.

నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్ల షాపులకు ఉదయం పది గంటల వరకు అనుమతినిస్తారు. ఇఫ్తార్‌కు అనుగుణంగా సాయంత్రం డ్రైఫ్రూట్స్‌ షాపులకు అనుమతిని ఇస్తారు. ఆహారం అందించే దాతలకు ప్రత్యేక సమయాలు కేటాయించారు. ఉదయం మూడు నుంచి నాలుగున్నర గంటల వరకు, సాయంత్రం అయిదున్నర నుంచి ఆరున్నర గంటల వరకు అనుమతి ఉంటుంది. అన్ని చోట్లా కాకుండా కేవలం మూడు నాలుగు పాయింట్లను గుర్తించారు అధికారులు. అందరూ అక్కడే ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇందులో కూడా భౌతికదూరాన్ని తప్పకుండా పాటించాలి. ముందే కొన్ని హోటల్స్‌ను గుర్తించి షెహరి, ఇఫ్తార్‌ సమయాల్లో టేక్‌ అవేలకు కూడా అనుమతి ఇస్తారు. మరోవైపు క్వారంటైన్‌లో ఉన్న ముస్లింలకు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ అందిస్తారు. ఉదయం, సాయంత్రం పౌష్టికాహారాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. రంజాన్‌ మాసం నేపథ్యంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా ఉండాలని, అవసరానికి సరిపడా మంచినీటిని కూడా సరఫరా చేయాలని ఈ ఉత్తర్వులో వైసీపీ ప్రభుత్వం పేర్కొంది.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..