Omicron Death: ఇజ్రాయెల్‌లో ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా మరణించిన మొదటి కేసు వెలుగులోకి వచ్చిందని ఇజ్రాయెల్ ఆరోగ్య అధికారులు తెలిపారు. దేశంలోని దక్షిణ నగరమైన బీర్‌షెబాలోని సోరోకా ఆసుపత్రిలో ఓమిక్రాన్‌తో చేరిన 60 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ వ్యక్తి ఆస్పత్రిలో చేరకముందే చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే వాటి గురించిన వివరాలు ఏమి చెప్పలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ విమాన రాకపోకలను నిషేధించింది. దేశం నుంచి బయటకు వెళ్లి మళ్లీ దేశంలోకి ప్రవేశించడం చాలా కష్టం. ఓమిక్రాన్ అరికట్టేందుకు ప్రభుత్వం దశలవారీగా నిషేధాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది.
ఇప్పటికే ప్రజలకు బూస్టర్ డోస్ కూడా ఇస్తుంది. అయితే దీని తర్వాత కూడా ప్రమాదం అలాగే ఉంది. వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం నాలుగో బూస్టర్ షాట్‌ను ఆమోదించడానికి ఆరోగ్య అధికారులు ఎదురుచూస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రజలకు విస్తృతంగా టీకాలు వేసిన మొదటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. వేసవి సీజన్‌లోనే ప్రజలు దేశంలో బూస్టర్ డోస్‌లను ప్రారంభించారు. 93 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్‌లో కోవిడ్-19 కారణంగా 8200 మందికి పైగా మరణించారు.