Covid-19 Vaccine Update: దేశంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్.. 37 కోట్లకు చేరువలో టీకాల పంపిణీ

India Corona Vaccination: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. రెండు నెలల క్రితం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త..

Covid-19 Vaccine Update: దేశంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్.. 37 కోట్లకు చేరువలో టీకాల పంపిణీ
India Corona Vaccination Updates

Updated on: Jul 09, 2021 | 9:12 AM

India Corona Vaccination: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. రెండు నెలల క్రితం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే.. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందన్న సూచనలతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా ముమ్మరంచేసింది. దీంతోపాటు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ.. వ్యాక్సిన్ ఉత్పత్తిపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో భారత్ వ్యాక్సినేషన్ పరంగా మరో మైలురాయిని సాధించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37 కోట్లకుపైగా చేరువలో కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గురువారం సాయంత్రం వరకు ఈ మార్క్‌కు చేరుకున్నట్లు వెల్లడించింది.

గురువారం రాత్రి 7 గంటల వరకు.. ఒక్కరోజు దేశవ్యాప్తంగా 36.08 లక్షలకుపైగా మోతాదులను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 18-44 సంవత్సరాల వరకు 10,82,14.937 మందికి మొదటి డోసు అందించగా.. మరో 33,70,920 మందికి రెండో డోసు అందించినట్లు తెలిపింది.

45 ఏళ్లు పైబడిన వారికి 9,25,25,774 మందికి మొదటి డోసు అందించగా.. 2,21,31,877 మందికి రెండో డోసు అందించినట్లు పేర్కొంది. అందరినీ కలుపుకొని మొత్తం 29,83,49,773 మంది తొలి డోడు, మరో 7,02,26,579 మందికి రెండో మోతాదు అందించినట్లు కేంద్రం వివరించింది.

Also Read:

కిమ్ వికృత చేష్టలకు ఆ రూమ్ అడ్డా.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువు.. సంగతి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video: బంజారా పాట.. రష్యాన్‌ల ఆట.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!