ఈ నెల 17 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు

| Edited By: Pardhasaradhi Peri

May 02, 2020 | 6:52 PM

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడిగించిన దృష్ట్యా.. అప్పటివరకు ప్యాసింజర్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే వలస కార్మికులు, యాత్రికులు, టూరిస్టులు, విద్యార్థులు, వేర్వేరు చోట్ల చిక్కుబడిపోయినవారి కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతామని తెలిపింది. సబర్బన్ రైళ్లు కూడా ఈ నెల 17 వరకు నడవబోవు. ప్రయాణికులెవరూ టికెట్ బుకింగ్ ల కోసం ఏ రైల్వే స్టేషన్ నూ విజిట్ చేయరాదని కోరింది. శ్రామిక్ […]

ఈ నెల 17 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు
Follow us on

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడిగించిన దృష్ట్యా.. అప్పటివరకు ప్యాసింజర్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే వలస కార్మికులు, యాత్రికులు, టూరిస్టులు, విద్యార్థులు, వేర్వేరు చోట్ల చిక్కుబడిపోయినవారి కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతామని తెలిపింది. సబర్బన్ రైళ్లు కూడా ఈ నెల 17 వరకు నడవబోవు. ప్రయాణికులెవరూ టికెట్ బుకింగ్ ల కోసం ఏ రైల్వే స్టేషన్ నూ విజిట్ చేయరాదని కోరింది. శ్రామిక్ రైళ్ల విషయంలో ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అయితే వీటి మధ్య సమన్వయం కోసం సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. కాగా.. రవాణా, పార్సిల్ రైళ్లు యధావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.