Covid-19 Second Wave: దేశంలో వైద్యులపై కొనసాగుతున్న కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో 798 మంది మృతి..

|

Jun 30, 2021 | 12:35 PM

Doctors – Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త

Covid-19 Second Wave: దేశంలో వైద్యులపై కొనసాగుతున్న కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో 798 మంది మృతి..
Indian Doctors
Follow us on

Doctors – Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త భారీగా తగ్గి.. 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతోపాటు నిత్యం వేయి మంది వరకు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ వైద్యరంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. సెకండ్‌ వేవ్‌లో కోవిడ్ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 798 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మంగళవారం రాత్రి వెల్లడించింది.

కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీలో అత్యధికంగా 128 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో 115 మంది వైద్యులు, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమ బెంగాల్‌లో 62 మంది, తమిళనాడులో 51 మంది, రాజస్థాన్‌లో 44 మంది, జార్ఖండ్‌లో 39 మంది, గుజరాత్‌లో 39, తెలంగాణలో 37 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది మృతి చెందారని ఐఎంఏ వెల్లడించింది. కాగా.. కరోనా మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Also Read:

Kamal Haasan: నలుగురు విలన్లతో తలపడనున్న విశ్వనటుడు.. మక్కల్ సెల్వన్ పేరు కూడా వినిపిస్తుందే..

Viral Video: పిల్లలతో దాగుడుమూతలు..! వైరలవుతోన్న క్రేజీ బాతు వీడియో!