Viral Video: పిల్లలతో దాగుడుమూతలు..! వైరలవుతోన్న క్రేజీ బాతు వీడియో!

తన పిల్లలతో దాగుడు మూతలు ఆడిన ఓ క్రేజీ బాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్ చేయకుండా ఉండలేరు. సరదాగా సాగిన ఈ వీడియోను బ్యూటెండేబీడెన్ అనే ఖాతాలో నిన్న అప్‌లోడ్ చేశారు.

Viral Video: పిల్లలతో దాగుడుమూతలు..! వైరలవుతోన్న క్రేజీ బాతు వీడియో!
Mother Duck Hide And Seek Game With Her Babies
Follow us
Venkata Chari

|

Updated on: Jun 30, 2021 | 12:24 PM

Viral Video: తన పిల్లలతో దాగుడు మూతలు ఆడిన ఓ క్రేజీ బాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్ చేయకుండా ఉండలేరు. సరదాగా సాగిన ఈ వీడియోను బ్యూటెండేబీడెన్ అనే ఖాతాలో నిన్న అప్‌లోడ్ చేశారు. 24 సెకన్ల క్లిప్.. ఇప్పటివరకు లక్షకు పైగా య్యూస్‌తో దూసుకపోతోంది. ఇంటర్నెట్‌లో జంతువులు, పక్షుల వీడియోలను చూసేందుకు నెటిజన్లు బాగా ఆసక్తి చూపిస్తారు. అందులో భాగంగానే ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ బాతు, తన పిల్లలతో కొలనులో సరదాగా తిరుగుతుంటాయి. అయితే ఒక్కసారిగా వాటి పక్కనున్న తల్లి బాతు నీటిలో మునిగి కొంత దూరంలో తేలుతుంది. దీంతో కంగారుపడిన పిల్లలు నీటిలోంచి బయటకువచ్చిన తల్లిని వెతుక్కుంటూ వెళ్తాయి. పిల్లలు తల్లిని చేరిన వెంటనే.. మరోసారి నీటిలో మునిగి ఇంకోచో ట తేలుతుంది తల్లి బాతు. మరలా అదే వరుస. ఇలా బాతు పిల్లలు తల్లిని చేరడం, తల్లి నీటిలో మునగడం.. మొత్తానికి పిల్లలతో భలేగా హైడ్‌ అండ్ సీక్ ఆడింది. చాలా సరదాగా ఉన్న వీడియోపై కామెంట్లు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి.

ఈ క్లిప్‌ ఇప్పటి వరకు 11,000 లైక్‌లు, 2,000 రీట్వీట్‌లతో హల్ చల్ చేస్తోంది. తల్లి బాతు 5 నిమిషాల ప్రశాతంత కోసం అలా చేసిందని కొందరంటే, ఇలాగే ప్రతి తల్లి పిల్లలకు ఎలా బతకాలో నేర్పిస్తుందని.. కష్టాలు వచ్చినప్పుడు ఎలా గట్టేక్కాలో నేర్పిస్తుందని.. మాతృ దేవో భవ.. తల్లే తొలి గురువు అంటూ అద్భుతంగా కామెంట్ చేశారు. స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్పిస్తుందని, తల్లిని ఎలా చేరుకోవాలో నేర్చుకుంటున్నాయంటూ ఇలా తలో రకంగా కామెంట్లను పంచుకున్నారు. మీరూ ఆ వీడియోను చూడండి:

Also Read:

Viral Video: గుండె లేకుండా 555 రోజులు.. ఎలా బతికాడో తెలుసా..?

Viral Video: పాట కోసం ఇండియన్ డిష్ ‘జిలేబీ’ తయారు చేసిన అమెరికన్ సింగర్..! వైరలవుతోన్న వీడియో