Viral Video: గుండె లేకుండా 555 రోజులు.. ఎలా బతికాడో తెలుసా..?
గుండె లేకుండా మన జీవించగలమా..? అస్సలు సాధ్యం కాదు కదా..! మరి ఇలాంటి అద్భుతం ఓ చోట జరిగింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా 555 రోజులు ఈ మనిషి గుండె లేకుండా బ్రతికాడు అంటే నమ్ముతారా!
Artificial Heart: గుండె లేకుండా మన జీవించగలమా..? అస్సలు సాధ్యం కాదు కదా..! మరి ఇలాంటి అద్భుతం ఓ చోట జరిగింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా 555 రోజులు ఈ మనిషి గుండె లేకుండా బతికాడంటే నమ్ముతారా! అవునండీ నిజమే. నిజజీవితంలో ఇలాంటి సంఘటన అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 25 ఏళ్ల లార్కిన్ అమెరికాలోని మిచిగన్ స్టేట్ లో నివసిస్తున్నాడు. 16 ఏళ్ల వయసులో లార్కిన్ బాస్కెట్ బాల్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. అనంతరం హాస్పిటల్‌కు తీసుకెళ్లగా… పరీక్షించిన డాక్టర్లు అతనికి షాకింగ్ న్యూస్ చెప్పారు. లార్కిన్ గుండెకు సంబంధించిన వ్యాధితోనే అలా కుప్పకూలిపోయాడంటూ తెలిపారు. ఏఆర్‌వీడీగా పిలిచే రైట్ వెంట్రిక్యూలర్ డిస్‌ప్లాసియా అనే వ్యాధి సోకినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.
ఏఆర్‌వీడీ వ్యాధి వల్ల లార్కిన్ హార్ట్ బీట్ సక్రమంగా ఉండదు. గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మరిన్ని పరీక్షల తరువాత లార్కిన్ స్టాన్ లార్కిన్ డోమినిక్ కార్డియోమయోపతితో బాధపడుతున్నారని డాక్టర్లు పేర్కొన్నారు. 2014లో లార్కిన్ గుండె పూర్తిగా పాడైపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. దీంతో లార్కిన్ గుండె పని చేస్తూనే ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చని షాకింగ్ లాంటి వార్త చెవిన పడేశారు. అయితే ఇది ఏ టైంకు జరుగుతుందో తెలియని, గుండె మార్పిడి ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని తెలిపారు. అనంతరం పాడైపోయిన గుండెను తొలగించిన డాక్టర్లు… ఒక మిషిన్ (సిన్ కార్డియో)ని శరీరం బయట అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో.. లార్కిన్ బతికిపోయాడు.
జన్యుపరమైన లోపాలతోనే లార్కిన్ గుండె పాడైనట్లు డాక్టర్లు నిర్ధారించాడు. ఆయనతోపాటు అతని సోదరుడి గుండె కూడా పాడైనట్లు తెలిపారు. ఈ మిషన్‌ను సింక్కార్డియా ఫ్రీడమ్ టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అని పిలుస్తుంటారు. లేదా బిగ్‌బ్లూగా మరికొన్ని చోట్ల పిలుస్తుంటారు. ఈ మిషన్ గుండె గాలిని కంప్రెస్డ్ రూపంలో పంపిస్తుంది. ఈ పైపులను రెండు గుండె కవాటాలకు అమర్చుతారు. మిషన్ ద్వారా గాలి హార్ట్ కు చేరుతుంది. ఈ మిషిన్ గుండెలాగే శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.
ఈ మిషన్ ప్రతి నిత్యం వారితో ఉండాల్సిందేనని డాక్టర్లు తెలిపారు. 6 కేజీల బరువుండే ‘సిన్ కార్డియో’ మెషీన్ ఓ బ్యాగులో పెట్టి స్టాన్ లార్కిన్ వీపుకి తగిలించారు డాక్టర్లు. దీంతో తను ఎక్కడి వెళ్లినా ఈ బ్యాగ్ తప్పనిసరిగా తీసుకెళ్లేశాడు. అనంతరం కొద్ది రోజులకు హర్ట్ ప్లాంటేషన్ చేయడంతో ఈ మెషిన్ నుంచి లార్కిన్ సోదరుడికి విముక్తి లభించింది. ప్రస్తుతం ఎలాంటి సమస్య లేకుండా జీవిస్తున్నాడు. అయితే లార్కిన్ కు మాత్రం హార్ట ప్లాంటెషన్ చేసేందుకు గుండె దొరకలేదు. దీంతో ఈ మెషీన్ తో 555 రోజులపాటు గడిపేశాడు. ఈ కృత్రిమ గుండెతోనే లార్కిన్ బాస్కెల్ బాల్ ఆడేవాడు. అనంతరం ఓ దాత గుండె దొరకింది. అలా మే 9న 2016లో అతనికి హార్ట్ ప్లాంటేషన్ చేశారు. ప్రస్తుతం లార్కిన్ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు.
Also Read:
Viral Video: పాట కోసం ఇండియన్ డిష్ ‘జిలేబీ’ తయారు చేసిన అమెరికన్ సింగర్..! వైరలవుతోన్న వీడియో
Viral Video: 10 కోడి గుడ్లు మింగి.. కక్కిన ఆరడుగుల కోబ్రా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..