Covid-19 India: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24గంటల్లో ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?

|

May 27, 2021 | 10:03 AM

Coronavirus Cases India: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు దేశంలో మరణాల

Covid-19 India: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24గంటల్లో ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?
Coronavirus In India
Follow us on

Coronavirus Cases India: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు దేశంలో మరణాల సంఖ్య పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉపశమనం కలిగించే విషయమేంటంటే.. కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పట్టింది. దేశంలో గడిచిన 24 గంటల్లో (బుధవారం) కొత్తగా 2,11,298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 3,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,69,093 కి చేరగా.. మరణాల సంఖ్య 3,15,235 కి పెరిగింది.

గత 24 గంటల్లో కరోనా నుంచి 2,83,135 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,46,33,951 కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24,19,907 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 21,57,857 కరోనా నిర్దారణ పరీక్షలు జరిపినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి 33,69,69,352 పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 20,26,95,874 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

Mandya: హృదయ విదారక ఘటన.. కోవిడ్ రిపోర్టు లేదని గర్భిణికి వైద్యం నిరాకరణ.. ఆ తర్వాత ఏమైందంటే?

అమెజాన్‌ చేతికి మీడియా కంపెనీ ఎమ్‌జీఎమ్‌.. శతాబ్ద కాలం అనుభవం ఉన్న ఈ స్టూడియో ఇప్పుడు ఈ కంపెనీ సొంతం..