Coronavirus: తగ్గుముఖం పడుతోన్న కరోనా మహమ్మారి .. మరణాలు మాత్రం ఆందోళకరంగానే.. గత 24 గంటల్లో ఎంత మంది చనిపోయారంటే..

గత కొన్ని రోజులుగా దేశాన్ని వణికిస్తోన్న కరోనా (C0vid) మహమ్మారి క్రమంగా శాంతిస్తోంది. మూడు లక్షలకు దిగువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే  మరణాల (Covid deaths) సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుండడం కలవరపెడుతోంది

Coronavirus: తగ్గుముఖం పడుతోన్న కరోనా మహమ్మారి .. మరణాలు మాత్రం ఆందోళకరంగానే.. గత 24 గంటల్లో ఎంత మంది చనిపోయారంటే..
Coronavirus Cases

Edited By:

Updated on: Jan 31, 2022 | 10:46 AM

గత కొన్ని రోజులుగా దేశాన్ని వణికిస్తోన్న కరోనా (C0vid) మహమ్మారి క్రమంగా శాంతిస్తోంది. మూడు లక్షలకు దిగువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే  మరణాల (Covid deaths) సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుండడం కలవరపెడుతోంది. నిన్న కూడా వెయ్యికి చేరువలో  మరణాలు నమోదుకావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ (Central health ministry) విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి శనివారం నమోదైన కేసుల కంటే 10 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా గడిచిన 24 గంటల్లో  ఏకంగా  959 మంది మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4, 95, 050 కు చేరింది.

మొదటి కరోనా కేసుకు రెండేళ్లు..

దేశంలో మొదటి కరోనా కేసు నమోదై ఆదివారంతో రెండేళ్లు పూర్తయ్యాయి.  ఇప్పటివరకు మూడు వేవ్ లు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.  కాగా  ప్రస్తుతం దేశంలో 18,31,268 క్రియాశీలక కేసులున్నాయి . ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 15.77 శాతానికి చేరుకుంది.   ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,62,628 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కొవిడ్ రికవరీల సంఖ్య  3,89,76,122 కు చేరుకుంది. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం కూడా 28,90,986 టీకా డోసులను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు 1,66,03,96,227 డోసులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:Health Tips: తిన్నతర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా? అయితే ఈ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోండి..

Viral video: జాతి వైరం మరిచిపోయిన శునకం, పిల్లి.. విక్రమార్కుడు, బేతాళుడిని గుర్తుచేశారంటోన్న నెటిజన్లు..

Viral Photo: ఈ ఫొటో తీయడానికి ఏడు గంటలు పట్టిందట.. ఇంతకీ ఈ ఫొటో ప్రత్యేకత ఏంటంటే..