AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ వ్యాప్తంగా 9 లక్షలు దాటిన కేసులు.. నిన్న ఒక్క రోజే 553 మంది మృతి..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న ఒక్క రోజే 553 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..

దేశ వ్యాప్తంగా 9 లక్షలు దాటిన కేసులు.. నిన్న ఒక్క రోజే 553 మంది మృతి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 14, 2020 | 11:00 AM

Share

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న ఒక్క రోజే 553 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,06,752కి చేరుకుంది. అలాగే దేశం మొత్తంగా ఇప్పటివరకు 23,727 మంది మరణించారు. ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా, అటు 5,71,460 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుతో సహా 8 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లిస్టులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల 60 వేలు దాటగా.. వైరస్ కారణంగా 10,482 మంది మరణించారు. ఇక తమిళనాడులో లక్షా 42 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,032 మరణాలు సంభవించాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో లక్షా 13 వేలు ఉండగా, 3,411 మరణాలు సంభవించాయి. ఇక ఆ తర్వాత గుజరాత్, కర్నాటక ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులలో సంభవించాయి.

Follow Us
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి