India Corona Cases: దేశంలో కొత్తగా 38,079 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 19,98,715 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..

India Corona Cases: దేశంలో కొత్తగా 38,079 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
India Corona Updates

Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 2:24 PM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 19,98,715 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,079 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. మరో 560 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.10కోట్లకు చేరగా.. 4,13,091 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న 100 రోజులు చాలా కీలకం కానున్నాయని, అత్యంత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది. కరోనా నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచింది.  కాగా.. ప్రస్తుతం దేశంలో 4,24,025 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.31 శాతానికి పెరిగింది. కొత్తగా 43వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.02కోట్ల మంది వైరస్‌ను జయించారు.

  • మొత్తం మరణాలు: 4,13,091
  • కోలుకున్నవారు: 3,02,27,792
  • యాక్టివ్​ కేసులు: 4,24,025
  • మొత్తం కేసులు: 3,10,64,908

వ్యాక్సినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి..

దేశంలో ఇప్పటివరకు 39,96,95,879 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 42,12,557 డోసులు అందించినట్లు పేర్కొంది. శుక్రవారం ఒక్కరోజే 19,98,715 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ వివరించింది.

Also Read: కోడే కదా అని భయపెట్టాలని చూశాడు.. అది బుడ్డోడ్ని 3 చెరువుల నీళ్లు తాగించింది

 ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహం వేట ఇంత దారుణంగా ఉంటుందా..?