Warning: యమ డేంజర్ : ఉపద్రవం ఎంతో దూరం లేదు .. దశ ఆల్రెడీ స్టార్టైపోయిందట. బి కేర్ ఫుల్.!

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Venkata Narayana

Updated on: Jul 17, 2021 | 9:30 AM

థర్డ్‌వేవ్‌ ఎంతో దూరం లేదు. కరోనా మూడో దశ ప్రారంభ దశలో ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే పెనుముప్పు తప్పదు..

Warning: యమ డేంజర్ : ఉపద్రవం ఎంతో దూరం లేదు ..  దశ ఆల్రెడీ స్టార్టైపోయిందట. బి కేర్ ఫుల్.!
People

Follow us on

Be careful: థర్డ్‌వేవ్‌ ఎంతో దూరం లేదు. కరోనా మూడో ముప్పు ప్రారంభ దశలో ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే పెనుముప్పు తప్పదు. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలివి. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న త‌రుణంలో ప్రపంచ‌వ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్‌ వేవ్ మొదలైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దుర‌దృష్టవ‌శాత్తు మ‌నం క‌రోనా థర్డ్‌వేవ్ ఆరంభద‌శ‌లో ఉన్నామ‌న్న చేదు నిజాన్ని చెప్పింది WHO.

క‌రోనా వైర‌స్ నిరంత‌రం మారుతోంద‌ని, మ‌రింత ప్రమాద‌క‌ర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయ‌ని WHO హెచ్చరించింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైర‌స్.. 111 దేశాల్లో వెలుగులోకి వచ్చింది. ప్రపంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచెందే అవ‌కాశాలు ఉన్నట్లు టెడ్రోస్‌ హెచ్చరించారు. కరోనా తగ్గిందన్న అపోహ చాలా దేశాల్లో కన్పిస్తోందని డబ్లుహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో కరోనా వేగంగా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. చాలామంది గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని.. దీంతో వైరస్‌ మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని వెల్లడించింది.

యూరప్‌ దేశాలతో పాటు అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పటికీ డెల్టా వేరియంట్‌ విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని డబ్లుహెచ్‌వో తెలిపింది. నాలుగు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. 10 వారాలు తగ్గినట్టు తగ్గి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండియాలో వారం రోజులుగా.. 38 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్న సమయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా ఆంక్షలను ఎత్తేశాయి. జనంలో నిర్లక్ష్యం కూడా పెరిగింది. దీంతో ఎప్పటి లాగే కనీస జాగ్రత్తలను గాలికి వదిలేశారు. మాస్కులు పెట్టడం మానేశారు. విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో మళ్లీ రద్దు పెరిగింది. తీర్థయాత్రలు, సామూహిక వేడుకలు మొదలయ్యాయి. ఇలాంటి తప్పిదాలు కొవిడ్‌ మూడో దశకు కారణం కావొచ్చని వైద్యశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read also : SCERT: విద్యార్థులకు ముఖ్య గమనిక: ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ రిలీజ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu