ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతుంది. అయితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గడం ఊరటనిచ్చే విషయం. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో వరుసగా మూడోరోజు కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గాయి. కొత్తగా 3,11,170 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా 4,077 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ వైరస్ వల్ల ప్రాణాలు విడిచినవారి సంఖ్య 2,70,284కు చేరింది. అయితే నమోదవుతున్న కేసుల కంటే కోలుకునేవారి సంఖ్య అధికంగా ఉండటం ఊరటగా భావించే అంశం. శనివారం ఒక్కరోజే 3,62,437 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,07,95,335కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. శనివారం 18,32,950 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 31,48,50,143కి చేరింది.
Also Read: ఏడాదికి రూ. 2 కోట్ల జీతం.. అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి అద్భుతం..