జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

India 21 Days Lockdown: ఏపీలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య సేవల నిమిత్తం బయటికి వెళ్ళాల్సిన వారు ఓలా క్యాబ్స్ వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదట పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం రాష్ట్రమంతటా సర్వీసులను విస్తరించనున్నారు. రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో అత్యవసర వైద్య రవాణా సేవలు అందించేందుకు ఓలా క్యాబ్స్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే […]

Ravi Kiran

|

Apr 10, 2020 | 2:39 PM

India 21 Days Lockdown: ఏపీలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య సేవల నిమిత్తం బయటికి వెళ్ళాల్సిన వారు ఓలా క్యాబ్స్ వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదట పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం రాష్ట్రమంతటా సర్వీసులను విస్తరించనున్నారు.

రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో అత్యవసర వైద్య రవాణా సేవలు అందించేందుకు ఓలా క్యాబ్స్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ రవాణా శాఖ, పోలీసు శాఖతో చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. డయాలసిస్, గుండెజబ్బులు, క్యాన్సర్ తదితర రోగులు ఓలా సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు.

ఆసుపత్రి నుంచి ఇంటికి.. ఇంటి నుంచి ఆసుపత్రికి మాత్రమే సేవలు అందిస్తారు. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికీ మాత్రమే అనుమతి ఉంటుంది. డాక్టర్లు, మెడికల్ సిబ్బంది కూడా ఈ ఓలా సర్వీసులను వినియోగించుకోవచ్చు. కాగా, కారులో ప్రయాణించేవారు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్లను తప్పనిసరిగా వినియోగించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇవి చదవండి:

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu