ఢిల్లీ ఐఐటీ కరోనా టెస్ట్ కిట్.. ఐసీఎంఆర్‌ ఆమోదం..

కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ఢిల్లీలోని ఐఐటీ పరిశోధకులు ఓ వినూత్న సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీనితో తక్కువ ఖర్చులోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ఇక తాజాగా ఈ విధానానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు పొందిన తొలి విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ కావడం విశేషం. మరోవైపు ఈ […]

ఢిల్లీ ఐఐటీ కరోనా టెస్ట్ కిట్.. ఐసీఎంఆర్‌ ఆమోదం..

Updated on: Apr 25, 2020 | 12:23 PM

కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ఢిల్లీలోని ఐఐటీ పరిశోధకులు ఓ వినూత్న సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీనితో తక్కువ ఖర్చులోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ఇక తాజాగా ఈ విధానానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు పొందిన తొలి విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ కావడం విశేషం.

మరోవైపు ఈ కిట్ వంద శాతం కరోనాను ఖచ్చితంగా గుర్తిస్తుందని ఐసీఎంఆర్ ధృవీకరించింది. పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) ఆధారంగా ఈ పరికరం పని చేస్తుందని తెలుస్తోంది. కాగా, చైనా తయారీ కిట్ల ద్వారా కరోనా పరీక్షల నిర్వహణను ఐసీఎంఆర్ నిలిపేసిన సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ కిట్‌పై పేటెంట్ పరిశోధక బృందం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

రంజాన్ వేళ.. ముస్లింలకు తీపి కబురు.. ఏపీలో కొన్ని సడలింపులు..

ఇకపై బాల్ ట్యాంపరింగ్ చేయవచ్చు .. ఐసీసీ సరికొత్త ఆలోచన..!