ఇకపై బాల్ ట్యాంపరింగ్ చేయవచ్చు .. ఐసీసీ సరికొత్త ఆలోచన..!

‘బాల్ టాంపరింగ్’ ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీ సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఇదివరకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ ఈ విషయంలో ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. సాధారణంగా బంతి మెరుపు కోసం క్రికెటర్లు అప్పుడప్పుడూ ఉమ్మిని పూస్తుంటారు. ముఖ్యంగా టెస్టుల్లో స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా చేస్తారు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రత ఉన్న కారణంగా అలా చేస్తే ముప్పు పొంచి ఉంటుందని ఐసీసీ మెడికల్‌ […]

ఇకపై బాల్ ట్యాంపరింగ్ చేయవచ్చు .. ఐసీసీ సరికొత్త ఆలోచన..!
Follow us

|

Updated on: Apr 25, 2020 | 1:56 PM

‘బాల్ టాంపరింగ్’ ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీ సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఇదివరకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ ఈ విషయంలో ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. సాధారణంగా బంతి మెరుపు కోసం క్రికెటర్లు అప్పుడప్పుడూ ఉమ్మిని పూస్తుంటారు. ముఖ్యంగా టెస్టుల్లో స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా చేస్తారు.

అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రత ఉన్న కారణంగా అలా చేస్తే ముప్పు పొంచి ఉంటుందని ఐసీసీ మెడికల్‌ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనితో అంతర్జాతీయ క్రికెట్‌లో మున్ముందు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఐసీసీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇకపై బంతి మెరుపు కోసం ఉమ్మిని కాకుండా ఆమోదయోగ్యమైన కృత్రిమ పదార్థాలు, ఇతర వస్తువులను అనుమతించాలని.. అది కూడా అంపైర్ల సమక్షంలోనే చేసేలా కొత్త రూల్‌ను తీసుకురావాలని అనుకుంటున్నారు. కాగా, గతంలో బంతి మెరుపు కోసం ఉమ్మిని కాకుండా మరే పదార్థాన్ని ఉపయోగించినా బాల్‌ ట్యాంపరింగ్‌గా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

రంజాన్ వేళ.. ముస్లింలకు తీపి కబురు.. ఏపీలో కొన్ని సడలింపులు..