Post Covid : కోవిడ్ సమస్య నుంచి బయటపడినప్పటికీ లక్షణాలు ఉంటే లాంగ్ కోవిడ్ అని పిలుస్తారు. కోవిడ్ సంక్రమణ లేకుండా 3-4 వారాలు లేదా నెలలు ఈ లక్షణాలు కొనసాగుతాయి. ఇప్పటికే లాంగ్ కొవిడ్ లక్షణాలపై పరిశోధనలు జరిగాయి. ఇది అనారోగ్యంతో బాధపడుతున్న మగవారు, మహిళలలో ఎక్కువగా ఉంటుంది. దగ్గు, ఊపిరి, ముక్కు కారటం, అధిక అలసట, తలనొప్పి, కీళ్లు లేదా కండరాల నొప్పులు, ఆందోళన, నిరాశ దీర్ఘ కాలిక కోవిడ్ లక్షణాలు. మనస్సును ప్రత్యేకంగా కేంద్రీకరించడానికి అవరోధాలు ఉంటాయి. అందువల్ల లాంగ్ కొవిడ్ లక్షణాలకు చికిత్స చేయడం చాలా ముఖ్యం.
శాశ్వతంగా కోవిడ్ నుంచి బయటపడటానికి, మానసిక స్థితిని మార్చడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం. దీర్ఘకాలిక కోవిడ్ ఉన్న ఎవరైనా తక్కువ నిద్ర, ఒత్తిడి, నిరాశతో బాధపడుతున్నారు. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది సాధారణం మరీ ముఖ్యంగా ఏదైనా లక్షణాలను అధిగమించడానికి లేదా మెరుగుపరచడానికి సమయం పడుతుందని మీరు గుర్తుంచాలి. ఈ పద్దతులు పాటిస్తే మీకు మంచి రిలీఫ్ దొరుకుతుంది.
1. సకాలంలో ఆహారం తీసుకోవాలి
2. మీ ఆహారం సమతుల్యంగా ఉండాలి.
3. వ్యాయామంతో పాటు పోషకమైన ఆహారాన్ని తినాలి.
4. స్వచ్ఛమైన గాలిని తీసుకోవాలి. ప్రకృతి తాజా గాలిలో ఎక్కువ సమయం గడపడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
5. మీ శరీరానికి విశ్రాంతి, మంచి నిద్ర సమయం కేటాయించాలి.
6. రోజువారీ ధ్యానం చేయాలి.
7. మనస్సు కలతపెట్టే వార్తలకు దూరంగా ఉండటం మంచిది.
8. ధూమపానం, మద్యం మానుకోవాలి.