హోమ్ క్వారంటైన్.. బాలీవుడ్ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారంటే..!

రణవీర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా అతను ఓ డిఫరెంట్ ఫోటోను పోస్ట్ చేసాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రణవీర్ గెటప్‌పై నెటిజన్లు రకరాలుగా కామెంట్స్..

  • Ram Naramaneni
  • Publish Date - 9:20 pm, Wed, 25 March 20
హోమ్ క్వారంటైన్.. బాలీవుడ్ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారంటే..!

బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటనలో, స్టైల్‌లో ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకుంటుంటాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రణవీర్ తాజాగా ఓ డిఫరెంట్ ఫోటోను పోస్ట్ చేసాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రణవీర్ గెటప్‌పై నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ‘గల్లీ బాయ్’ సినిమా ఇచ్చిన హిట్ తో మంచి జోష్ మీదున్న ఈ యాంగ్ హీరో అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు పెడుతూ అందరూ తన గురించి మాట్లాడేలా చేస్తుంటాడు.

అది మనోడికి మాములే.. ఇక తాజా ఫొటోలో రణవీర్ అఘోరాలా దర్శనమిచ్చాడు. చూస్తేనే భయం వేసేలా తెల్లటి కళ్ళు, కళ్ళకు కాటుక, దట్టంగా పెరిగిన జుత్తుతో రాక్షసుడిగా కనిపించడు. ఈ ఫోటోకి ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు. ప్రస్తుతం కరోనా దెబ్బకు సెల్ఫ్ క్వారెంట్‌లో ఉన్న తాను త్వరలో ఇలా బయటకు వస్తానని రాసాడు. దానికి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నీ భర్తకు అతి ఎక్కువైంది దీపికా.. అని కొంతమంది విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా మరోసారి ఈ ఫోటోతో రణవీర్ హాట్ టాపిక్ అయ్యాడు.

కరోనా మహమ్మారి విస్తురిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్‌ను విధించాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. మన దేశాన్ని కూడా  చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తం కరోనా కేసులు 511 నమోదు అయ్యాయి. మరణాలు 10 నమోదు అయ్యాయి. ప్రజలంతా గడప దాటిబయటకు రావడం లేదు. దేశం అంతా స్తంభించిపోయింది. ఇదిలా ఉంటే సెలబ్రెటీలు కరోనా సెలవలు కారణంగా ఇళ్లకే పరిమితమయిపోయారు. కొంతమంది ఇళ్ల వద్దనే యోగాలు, కసరత్తులు చేసుకుంటూ గడిపేస్తున్నారు. మరికొందరు తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ వయ్యారి భామ మా త్రం ఇంటి పట్టునుండి ఇంటిపనుల్లో నిమగ్నమైంది.

ఇర సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ కూడా కుటుంబంతో  తను సరదగా గడుపుతున్న వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు  సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా  ఇంట్లో పాత్రలు కడుగుతూ ఇంటి పనుల్లో బిజీగా ఉన్న వీడియోను షేర్ చేసింది .ఈ వీడియో ఇప్పుడు  నెట్టింట వైరల్ అవుతుంది. సినిమాల్లో విభిన్న పాత్రలే చేయడమే కాదు ఇంట్లో పాత్రలు కూడా ఈ అమ్మడు ఎంచక్కా కడుగుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/B-DTjyZhRSC/?utm_source=ig_web_copy_link