క్లోరోక్విన్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..!
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోవిడ్-19పై యుద్ధంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నాయి.
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోవిడ్-19పై యుద్ధంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వదంతులు కూడా ప్రచారమవుతున్నాయి. మలేరియాకు వాడే మందులను ఈ వైరస్ సోకకుండా నిరోధించేందుకు ఉపయోగించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది హైడ్రోక్సీక్లోరోక్విన్ మందులను విపరీతంగా కొంటున్నారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో, దీనిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నించింది.
కాగా.. వైద్యుల స్పష్టమైన సలహా లేకుండా హైడ్రోక్సీక్లోరోక్విన్‌ను వాడవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రజలను హెచ్చరించింది. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ హైడ్రోక్లోరోక్విన్ అనేది హెల్త్ కేర్ వర్కర్ల నిర్దిష్ట ఉపయోగం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అందువల్ల దీనిని వైద్యుల సలహా లేకుండా తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.