కరోనావైరస్ లాక్‌డౌన్.. అప్పటి వరకు HD క్వాలిటీ లేనట్లే..!
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు థియేటర్లు, మాల్స్ సైతం మూతపడ్డాయి. దీంతో ఇంటర్నెట్ వాడకం దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో డిజిటల్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ ఆన్ లైన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అమెజాన్‌ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఎంఎక్స్ ప్లేయర్, హాట్‌స్టార్, టిక్‌టాక్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్‌లో HD, […]
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు థియేటర్లు, మాల్స్ సైతం మూతపడ్డాయి. దీంతో ఇంటర్నెట్ వాడకం దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో డిజిటల్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది.
దిగ్గజ ఆన్ లైన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అమెజాన్‌ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఎంఎక్స్ ప్లేయర్, హాట్‌స్టార్, టిక్‌టాక్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్‌లో HD, ఆల్ట్రా HD వీడియో ప్రసారాలను తాత్కాలికంగా SDలో మాత్రమే అందించాలని ఆయా సంస్థలు నిర్ణయించుకున్నాయి. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిజిటల్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఏప్రిల్ 14 వరకు మొబైల్ నెట్‌వర్క్‌లో 480pలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతాయి. నెట్‌వర్క్ సమస్య ఏర్పడకుండా, వర్క్‌ఫ్రమ్ హోం చేసేవారికి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.