Breaking: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురికి కరోనా పాజిటివ్..

|

Jul 20, 2020 | 5:56 PM

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని..

Breaking: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురికి కరోనా పాజిటివ్..
Follow us on

Aishwarya Arjun Tests Corona Positive: కరోనా వైరస్.. ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని.. ఎప్పటికప్పుడు మెడికల్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక గత కొద్దిరోజులుగా తనతో కాంటాక్టులో ఉన్నవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఐశ్వర్యా ట్విట్టర్ ద్వారా కోరింది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..