తెలుగు రాష్ట్రాలలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వివరాలు..

జూన్ 1 నుంచి రైల్వేశాఖ కేవలం రిజర్వేషన్ కేటగిరితో 200 ప్రత్యేక రైళ్లను నడపనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రూట్లు, రైళ్ళ వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. అంతేకాక గురువారం నుంచి ఆన్ లైన్ టిక్కెట్ల బుకింగ్‌ను కూడా మొదలుపెట్టింది. ఇక ఇవాళ్టి నుంచి పలు రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా కూడా బుకింగ్‌ చేసుకునేందుకు అవకాశం కనిపించింది. ఇందులో భాగంగానే 73 రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. […]

తెలుగు రాష్ట్రాలలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వివరాలు..

Updated on: May 23, 2020 | 12:07 AM

జూన్ 1 నుంచి రైల్వేశాఖ కేవలం రిజర్వేషన్ కేటగిరితో 200 ప్రత్యేక రైళ్లను నడపనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రూట్లు, రైళ్ళ వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. అంతేకాక గురువారం నుంచి ఆన్ లైన్ టిక్కెట్ల బుకింగ్‌ను కూడా మొదలుపెట్టింది. ఇక ఇవాళ్టి నుంచి పలు రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా కూడా బుకింగ్‌ చేసుకునేందుకు అవకాశం కనిపించింది.

ఇందులో భాగంగానే 73 రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా, ఏపీలో 44, తెలంగాణలో 18, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో 5 రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు ఎక్కడ ఉన్నాయంటే..

ఏపీలో ఈ చోట్ల రిజర్వేషన్ కౌంటర్లు…

విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా కెనాల్ జంక్షన్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కడప, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, అనకాపల్లి, రాయనపాడు, కొండపల్లి, చిత్తూరు, అనంతపూర్, ధర్మవరం స్టేషన్లలో మాత్రమే స్పెషల్ ట్రైన్స్‌కు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇలా ఉన్నాయి…

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట, మహబూబ్‌నగర్‌, కృష్ణా రైల్వే స్టేషన్లు…

Read More:

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..