AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GX-P2V Virus: చైనాలో మరో డేంజరస్ వైరస్‌.. ప్రపంచదేశాల్లో మరోసారి వైరస్ ఫియర్‌

మూడేళ్ల పాటు ప్రపంచాన్ని కుళ్లబొడిచిన కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనా. ఆవిషయం దాదాపుగా కన్‌ఫమ్ ఐంది. ఇప్పుడు అదే చైనా మరో డేంజరస్ వైరస్‌కి కేరాఫ్‌గా మారింది. పేరు GX-P2V. కోవిడ్19లా ఇది ఆగిఆగి వచ్చేది కాదు.. ఈ వైరస్‌ గనుక సోకిందంటే మరణాల రేటు 100 శాతం పక్కా అంటున్నారు నిపుణులు. ఇమ్యూనిటీలకు భయపడి వెనక్కి వెళ్లే ఛాన్సే లేదట. ఈ వార్తలు మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.

GX-P2V Virus: చైనాలో మరో డేంజరస్ వైరస్‌.. ప్రపంచదేశాల్లో మరోసారి వైరస్ ఫియర్‌
Virus
Balaraju Goud
|

Updated on: Jan 18, 2024 | 9:18 PM

Share

ఇది అట్లాంటి ఇట్లాంటి కరోనా కాదు. కరోనా ‘కింగ్‌సైజ్’. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి.. అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది. కోట్లాదిమందిని మంచం పట్టించి, లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా.. మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ఇంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త వైరస్ పుట్టినిల్లు కూడా ఆ డ్రాగన్ కంట్రీయేనట.

మూడేళ్ల పాటు ప్రపంచాన్ని కుళ్లబొడిచిన కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనా. ఆవిషయం దాదాపుగా కన్‌ఫమ్ ఐంది. ఇప్పుడు అదే చైనా మరో డేంజరస్ వైరస్‌కి కేరాఫ్‌గా మారింది. పేరు GX-P2V. కోవిడ్19లా ఇది ఆగిఆగి వచ్చేది కాదు.. ఈ వైరస్‌ గనుక సోకిందంటే మరణాల రేటు 100 శాతం పక్కా అంటున్నారు నిపుణులు. ఇమ్యూనిటీలకు భయపడి వెనక్కి వెళ్లే ఛాన్సే లేదట. ఈ వార్తలు మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.

కోవిడ్‌19కి మూల కారణమైన సార్స్‌-కొవ్‌-2 (sars cov 2) రకానికి చెందిందే జీఎక్స్‌_పీ2వీ. మొదటగా 2017లో దీన్ని మలేషియన్‌ పాంగోలిన్స్‌ జంతువుల్లో గుర్తించారు. తాజాగా ఇదే వైరస్‌ నుంచి కొత్త రకాన్ని చైనాలోని వ్యుహాన్ ల్యాబ్‌లో సీక్రెట్‌గా ఉత్పత్తి చేశారట. మొదటగా దీన్ని నాలుగు ఎలుకలపై పరిశోధించి చూశారట చైనా సైంటిస్టులు.

ఊపిరితిత్తులు, కళ్లు, ఎముకలు, శ్వాసనాళం, మెదడు పూర్తిగా దెబ్బతింటాయట. అలాగే శరీర బరువు తగ్గి, కళ్లు తెల్లబారి, కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఎలుకలు నడవలేని స్థితికి చేరాయి. మూడురోజుల తర్వాత మెదడుపై వైరల్ లోడ్‌ భారీగా పెరిగి చనిపోయాయి. పొరబాటున ల్యాబ్ నుంచి ఇదే వైరస్‌ బైటికొచ్చి మనుషుల్లోకి ఎంటరైతే మటాషేనంటున్నారు నిపుణులు. ఇవే లక్షణాలతో వారం రోజుల్లోనే చనిపోతారనేది ప్రాధమిక అంచనా.

గతంలో కొవిడ్‌-19 సోకినవాళ్లను క్వారంటైన్‌లో ఉంచి, పక్కా మెడికేషన్‌తో రోగనిరోధక శక్తిని పెంచి, వైరస్‌ని శరీరంలోపలే చంపేసేవాళ్లం. అందుకే 70 కోట్ల మందికి కరోనా సోకితే 69 లక్షల మంది మాత్రమే మరణించారు. వ్యాక్సిన్లతో క్రమక్రమంగా రికవరీ రేటు పెరిగింది. డెత్‌రేటు ఒక్కశాతం దగ్గరే ఆగిపోయింది. కానీ.. చైనా ల్యాబ్స్‌లో తయారైనట్టు చెబుతున్న జీఎక్స్‌_పీ2వీ సోకితే వందకు వందమందీ చనిపోతారని, మానవ మనుగడే ఉండబోదని చెబుతున్నాయి రిపోర్టులు.

వూహాన్ ల్యాబ్‌లో జరిగిన తాజా పరిశోధనల విషయం గ్లోబల్ మీడియాలో రావడంతో యావత్ ప్రపంచం మళ్లీ ఉలిక్కిపడింది. మరోసారి డ్రాగన్ కంట్రీపై విరుచుకుపడటం మొదలైంది. ప్రాణాంతక వైరస్‌ను ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలనే కుట్రను చైనా మరోసారి అమలు చేస్తోందంటూ విమర్శలొస్తున్నాయి. అయితే జీఎక్స్ పీ2వీ వైరస్‌కు సంబంధించిన ప్రయోగాలతో వూహాన్‌ ల్యాబ్‌కు ఎటువంటి ప్రమేయం లేదంటోంది చైనా మీడియా. కానీ… ప్రపంచదేశాలన్నీ మరోసారి వైరస్ ఫియర్‌తో వణికిపోతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..