AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Virus: మనుషుల్ని చంపేసే వైరస్‌పై చైనా ప్రయోగాలు.? ఈ సారి మరణాల రేటు 100 శాతం.?

New Virus: మనుషుల్ని చంపేసే వైరస్‌పై చైనా ప్రయోగాలు.? ఈ సారి మరణాల రేటు 100 శాతం.?

Anil kumar poka
|

Updated on: Jan 19, 2024 | 5:37 PM

Share

రెండున్నరేళ్లు యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఈ వైరస్‌ను చైనా నే సృష్టించిందని, దాన్ని ప్రపంచదేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని భావించిందనే విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. డ్రాగన్‌ మాత్రం వీటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది. అయితే కొవిడ్ భయాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటపడుతున్న తరుణంలో మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్‌పై బీజింగ్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాని మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెండున్నరేళ్లు యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఈ వైరస్‌ను చైనా నే సృష్టించిందని, దాన్ని ప్రపంచదేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని భావించిందనే విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. డ్రాగన్‌ మాత్రం వీటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది. అయితే కొవిడ్ భయాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటపడుతున్న తరుణంలో మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్‌పై బీజింగ్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాని మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. వూహాన్‌లో జరిపిన ఓ అధ్యయనంతో ఈ విషయం బయటపడినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఆ అధ్యయన వివరాల ప్రకారం.. SARS-CoV-2కు చెందిన GX_P2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారట. ఇది 2017లో వెలుగుచూసిన జీఎక్స్‌ ఉత్పరివర్తనంగా తెలుస్తోంది. గతంలో దీన్ని మలేషియన్‌ పాంగోలిన్స్‌ జంతువుల్లో గుర్తించారు. ఈ వైరస్‌ మ్యుటేటెడ్ వెర్షన్‌ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారట. వాటిపై ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపించిందని, ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని అధ్యయనం వెల్లడించింది. ఈ వైరస్‌ కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయని తెలిపింది. బరువు తగ్గి బలహీనంగా మారాయని, కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైందని అధ్యయనం పేర్కొంది. ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. GX_P2V వైరస్‌తో మనుషులకు పెను ముప్పు వాటిల్లనుందని తెలుస్తున్నట్టు అధ్యయనకారులు పేర్కొన్నారు. దీంతో డ్రాగన్‌ ప్రయోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos