AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాలంలో చిన్నారులకు స్కూల్.. రూల్స్ బేఖాతరు

కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రభుత్వ పాఠశాల తెరుచుకుంది. నెల్లూరు జిల్లాలోని అనపర్తి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కరోనా టైంలో ఓపెన్ అయింది. విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాలను తెరిచారు. దీంతో టిఫిన్ బాక్సులు, బుక్స్, బ్యాగ్స్‌‌లతో..

కరోనా కాలంలో చిన్నారులకు స్కూల్.. రూల్స్ బేఖాతరు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 16, 2020 | 1:33 PM

Share

కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రభుత్వ పాఠశాల తెరుచుకుంది. నెల్లూరు జిల్లాలోని అనపర్తి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కరోనా టైంలో ఓపెన్ అయింది. విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాలను తెరిచారు. దీంతో టిఫిన్ బాక్సులు, బుక్స్, బ్యాగ్స్‌‌లతో ప్రత్యక్ష్యమయ్యారు పిల్లలు. 80 రోజుల తరువాత స్కూల్ ఓపెన్ చేయడంతో.. రెడీ అయి విద్యార్థులు పాఠశాలకు వచ్చేశారు. అయితే స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదన్నారు ఎమ్ఈవో. కేవలం ఆన్‌లైన్ క్లాసులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆ పాఠశాల హెడ్‌మాస్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆన్ లైన్ క్లాసులు చెక్ చేయడానికే పిల్లలను స్కూల్‌కి రమ్మన్నాని పొంతనలేని సమాధానం చెప్పారు.

కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. 47మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Read More: 

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు.. పదో రోజు ఎంత పెరిగిందంటే?

సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..