Remdesivir: ‘రెమిడెసివిర్’ను ఆసుపత్రులే ఇవ్వాలి.. ఎప్పుడు పడితే అప్పుడు వాడొద్దు.. కేంద్రం గైడ్‌లైన్స్

|

Jun 08, 2021 | 8:05 AM

Covid-19 treatment: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రెమిడెసివిర్ ఇంజన్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ

Remdesivir: ‘రెమిడెసివిర్’ను ఆసుపత్రులే ఇవ్వాలి.. ఎప్పుడు పడితే అప్పుడు వాడొద్దు.. కేంద్రం గైడ్‌లైన్స్
Remdesivir
Follow us on

Covid-19 treatment: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రెమిడెసివిర్ ఇంజన్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం పలు గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. కరోనా రోగులకు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను ఆసుపత్రులే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. రోగులు, వారి సహాయకులకు బయట రిటైల్‌ మార్కెట్‌ నుంచి తెచ్చుకోమని చెప్పొద్దని కేంద్రం సూచించింది. రోగికి వైద్యసేవలు అందిస్తున్న సీనియర్‌ వైద్యులు, స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మాత్రమే రెమ్‌డెసివిర్‌ను ప్రతిపాదించాలని వెల్లడించింది. అయితే.. ఈ డ్రగ్ ను రోగికి అందించాలనుకున్నప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్‌.. సీనియర్‌ డాక్టర్‌తో సంప్రదించిన తర్వాతే ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ డ్రగ్ ప్రతిపాదించిన డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ మీద పేరు, సంతకం, స్టాంప్‌ తప్పనిసరిగా వేయాలని సూచించింది.

ఆసుపత్రిలో రెమిడెసివిర్‌ వినియోగం గురించి ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రతి.. అన్ని ఆసుపత్రుల్లో తప్పనిసరిగా స్పెషల్‌ డ్రగ్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఈ కమిటీల్లో వీలైతే ఒక ఫార్మకాలజీ ప్రొఫెసర్‌ను కూడా సభ్యుడిగా నియమించాలని పేర్కొంది. ఈ కమిటీ రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగంపై సమీక్షించి.. ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేయాలని పేర్కొంది. అయితే.. రెమిడెసివిర్‌ను కేవలం మధ్యస్థాయి, తీవ్రమైన లక్షణాలతో ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్న రోగులకు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇది అత్యవసర వినియోగం కోసం అనుమతిచ్చిన ఒక రిజర్వ్‌ డ్రగ్‌ మాత్రమేనంటూ పేర్కొంది. తేలికపాటి లక్షణాలున్న వారికి, ఇష్టనుసారంగా ఈ డ్రగ్ ను ప్రతిపాదించకూడదంటూ స్పష్టంచేసింది.

Also Read:

Ganga River : గంగానదిలో అస్తికలు కలిపేందుకు పోస్టల్‌ శాఖ వినూత్న ప్రయోగం, ​ఓమ్​ దివ్య దర్శన్ ద్వారా మరణానంతర క్రతువు

Lightning Strikes: ఆ రాష్ట్రంలో పిడుగుపాటు ఘటనలకు 26 మంది మృతి.. ప్రధాని మోదీ సంతాపం..