ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ‘ఆ’ జిల్లా..

|

May 16, 2020 | 1:37 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీవాసులకు ఊరటను కలిగిస్తూ ప్రకాశం జిల్లాలోని కరోనా పేషంట్లు అందరూ కూడా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడం శుభ పరిణామం అని చెప్పాలి. గత కొద్దిరోజులుగా ఈ జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు. అంతేకాకుండా ఇప్పటివరకూ ఉన్న 63 మంది కరోనా బాధితులూ పూర్తిగా కోలుకున్నారు. దీనితో ఒక్క కరోనా మరణం లేకుండా, రోగులంతా కోలుకుని డిశ్చార్జ్ అయిన […]

ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ఆ జిల్లా..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీవాసులకు ఊరటను కలిగిస్తూ ప్రకాశం జిల్లాలోని కరోనా పేషంట్లు అందరూ కూడా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడం శుభ పరిణామం అని చెప్పాలి. గత కొద్దిరోజులుగా ఈ జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు.

అంతేకాకుండా ఇప్పటివరకూ ఉన్న 63 మంది కరోనా బాధితులూ పూర్తిగా కోలుకున్నారు. దీనితో ఒక్క కరోనా మరణం లేకుండా, రోగులంతా కోలుకుని డిశ్చార్జ్ అయిన తొలి జిల్లాగా ప్రకాశం నిలిచింది. కాగా, కరోనా వ్యాప్తి ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2205కి చేరింది.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..