లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!

దాదాపు 50 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయింది. ఈ నేపధ్యంలో 18వ తేదీ నుంచి మొదలుకానున్న నాలుగోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. అంతేకాకుండా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయనున్నారని తెలుస్తోంది. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం కూడా పూర్తిగా లాక్ డౌన్ తొలిగించడానికి సిద్దంగా లేదని.. […]

లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!
Follow us

|

Updated on: May 16, 2020 | 12:20 PM

దాదాపు 50 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయింది. ఈ నేపధ్యంలో 18వ తేదీ నుంచి మొదలుకానున్న నాలుగోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. అంతేకాకుండా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయనున్నారని తెలుస్తోంది.

ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం కూడా పూర్తిగా లాక్ డౌన్ తొలిగించడానికి సిద్దంగా లేదని.. కానీ వారందరూ ఆర్ధిక కార్యకలాపాలను సాగించేందుకు తగినట్లు సరికొత్త ఎగ్జిట్ ప్లాన్ కోరుకుంటున్నారని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనుందని సమాచారం. అలాగే స్కూళ్ళు, కాలేజీలు, మాల్స్, థియేటర్లు దేశవ్యాప్తంగా మూసి ఉంటాయని ఆయన అన్నారు. అటు సెలూన్స్, బార్బర్ షాప్స్, స్పాస్ రెడ్ జోన్లలో ఓపెన్ చేసే అవకాశం ఉందని.. అలాగే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అన్ని మూసి ఉంటాయని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో హెయిర్ సెలూన్లు తెరిచి ఉన్న సంగతి విదితమే. అటు పరిమితంగా రైళ్లు, బస్సులు, దేశీయ విమానాలు కూడా తిరిగే అవకాశముందని చెప్పారు.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..