Soli Sorabjee dies of Covid-19: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజగా కరోనా మహమ్మారితో మరో ప్రముఖ వ్యక్తి మృతి చెందారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సొరాబ్జీ ( 91 ) కన్నుమూశారు. సోరాబ్జీ కరోనాతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
1930లో ముంబయిలో జన్మించిన సొరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్‌గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా సొరాబ్జీ బాధ్యతలు సేవలందించారు. దీంతపాటు సోరాబ్జీ మానవ హక్కుల కోసం విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిపై అధ్యయనం కోసం ఐక్యరాజ్య సమితి ఆయనను ప్రతినిధిగా పంపింది. అనంతరం ఆయన ఐక్యరాజ్యసమితి ‘ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ ఉప సంఘానికి చైర్మన్‌గా, 1998-2004 మధ్య ‘ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్’ ఉప సంఘంలో సభ్యుడిగానూ నియమించింది.
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పలు కీలక కేసుల్లో సొరాబ్జీ తన వాదనలు వినిపించారు. దీంతోపాటు ఆయన పలు కీలక రచనలను సైతం రచించారు. సోరాబ్జీ సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
Also Read: