మానవత్వం చాటిన వైద్యుడు..కరోనా మృతుడి అంత్యక్రియలకు అన్నీ తానై..

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి చెందగా అతడి అంత్యక్రియలను

మానవత్వం చాటిన వైద్యుడు..కరోనా మృతుడి అంత్యక్రియలకు అన్నీ తానై..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 12:24 PM

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి చెందగా అతడి అంత్యక్రియలను వైద్యులే నిర్వహించాల్సి వచ్చింది. అంతేకాదు, మృతదేహన్ని తరలించేందుకు కూడా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్‌లో తరలించడానికి ప్రయత్నించారు. అయితే తాను ట్రాక్టర్‌ను నడపనని చెప్పిన మున్సిపల్ డ్రైవర్ వాహనం వదిలివెళ్లిపోవటంతో..డాక్టరే ట్రాక్టర్ నడిపించి మానవత్వం చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పెద్దపల్లి జిల్లాలో కోవిడ్ బారిన పడి మృతిచెందిన వ్యక్తికి వైద్యులే దగ్గరుండి దహనకార్యక్రమాలు నిర్వహించారు. సుల్తానాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీరామ్ పీపీఈ కిట్టు ధరించి మ‌ృతదేహన్ని తరలించేందుకు ట్రాక్టర్ నడిపారు. సిబ్బందితో కలిసి మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు డాక్టర్ అక్కడే అనంతరం ఆస్పత్రికి వెళ్లారు. మానవత్వం చాటుకున్న డాక్టర్ శ్రీరామ్‌ ఔదర్యానికి స్థానికులు ఎంతగానో ప్రశంసించారు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావటంతో నెటిజన్లు సైతం వైద్యుడి ఉదారతను అభినందిస్తూ..కామెంట్లు, లైకులు చేస్తున్నారు.