Delhi Govt Corona Restrictions: కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. భారత్‌ను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆక్సిజన్ అందక, క్షణాల్లో పరిస్థితి చేయి దాటడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కేసులు సంఖ్యతో పాటు మరణాలు సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. మానవాళి మునుపెన్నడు చూడని పెను విపత్తును ఎదుర్కొంటోంది.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి ఆయా రాష్ట్రాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు పలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళన కలిగించే తీరులో పెరుగుతున్నాయి. తాజాగా అత్యధిక మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఢిల్లీ సర్కారు కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఏ మార్గంలో వచ్చినా 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారన్ టైన్‌కు వెళ్లాలని ఆదేశించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగటివ్ ఉంటే 7 రోజుల హోం క్వారన్ టైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలో కరోనా వైరస్ నూతన వేరియంట్‌ను గుర్తించిన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
Also Read: టైప్ 2 డయాబెటిస్ రోగులకు వేపనీరు దివ్యఔషధం..! పరగడుపున సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..
పాపం దున్న..! దారి తప్పి గ్రామంలోకి వచ్చిన అడవి దున్నకు అనుకోని షాక్.. బతుకు జీవుడా అని చివరకు ఇలా..