Corona Vaccination Update: క‌రోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాత వ్యాక్సిన్.. !

|

May 18, 2021 | 2:51 PM

కరోనాను జ‌యించినవారు తొమ్మిది నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్‌ నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌....

Corona Vaccination Update: క‌రోనా నుంచి  కోలుకున్నవారికి 9 నెలల తర్వాత వ్యాక్సిన్..  !
Corona Vaccine
Follow us on

కరోనాను జ‌యించినవారు తొమ్మిది నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్‌ నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) రిఫ‌ర్ చేస్తోంది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉంటే బెట‌ర్ అని చెప్పిన‌ ఈ ప్యానెల్‌.. ఇప్పుడు దాన్ని తొమ్మిది నెలలకు పెంచింది. తాజా ప్రతిపాదనలను ప్యానెల్‌ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మ‌రికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత గైడ్ లైన్స్ ప్రకారం.. కోవిడ్ సోకిన‌వారు.. రిక‌వ‌ర్ అయ్యాక‌ 4-8 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాండీబాడీస్ మరింత ఎక్కువగా డెవ‌ల‌ప్ అవుతాయ‌ని ఎన్‌టీఏజీఐ చెబుతోంది.

”కరోనా సోకి కోలుకున్నవారు ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్ కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటే మంచింది. తొమ్మిది నెలల తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్ల‌యితే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది” అని ప్యానెల్‌ వివరించింది. ఇదిలా ఉండగా.. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలలకు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్‌వో కూడా చెబుతోంది.

Also Read:  తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు స్టైఫండ్ పెంపుతూ ఉత్త‌ర్వులు

సిడ్నీ నగరంలో గగుర్పాటు కలిగించే మ్యూజియం, శవాలతో ప్రదర్శనశాల