దేశంలో 2 వేలు దాటిన కరోనా మరణాల సంఖ్య…

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో శనివారం ఒక్కరోజే 3277 కేసులు నమోదు కావడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62,939 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 2109కి చేరింది. అటు ఈ వైరస్ నుంచి 19,358 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే […]

Follow us

|

Updated on: May 10, 2020 | 11:28 AM

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో శనివారం ఒక్కరోజే 3277 కేసులు నమోదు కావడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62,939 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 2109కి చేరింది. అటు ఈ వైరస్ నుంచి 19,358 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అయితే కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 20,228కి చేరగా 779మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ముంబై నగరంలోనే కరోనా కేసుల సంఖ్య 12 వేలు దాటింది. ఇక గుజరాత్ విషయానికి వస్తే.. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 7796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు వైరస్ బారిన పడి 472మంది మరణించారు. ఇక మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3614 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 215మంది ప్రాణాలు విడిచారు. అటు ఢిల్లీలో 6542 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 73మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తమిళనాడులో వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 6535 కేసులు, 44 మరణాలు సంభవించాయి. ఇక రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు..