పోలీస్ స్టేషన్ లో.. చేతులకు సంకెళ్లతో..సీఆర్ఫీఎఫ్ కమెండో !

కరోనా ఓ సీఆర్ఫీఎఫ్ కమెండో పట్ల శాపంగా మారింది. ఈ వైరస్ నేపథ్యంలో ముఖానికి మాస్క్ ధరించనందుకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచారు. పైగా చేతికి సంకెళ్లు వేసి నేలపై కూచోబెట్టారు. కర్ణాటకలో జరిగింది ఈ వింత ఉదంతం.. మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన కోబ్రా యూనిట్ లోని కమెండో అయిన ఇతని పేరు సచిన్ సావంత్ అట. తన సొంత పట్టణమైన బెళగావి లో ఉంటున్నాడు. ఏదో పని మీద […]

పోలీస్ స్టేషన్ లో.. చేతులకు సంకెళ్లతో..సీఆర్ఫీఎఫ్ కమెండో !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 27, 2020 | 6:58 PM

కరోనా ఓ సీఆర్ఫీఎఫ్ కమెండో పట్ల శాపంగా మారింది. ఈ వైరస్ నేపథ్యంలో ముఖానికి మాస్క్ ధరించనందుకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచారు. పైగా చేతికి సంకెళ్లు వేసి నేలపై కూచోబెట్టారు. కర్ణాటకలో జరిగింది ఈ వింత ఉదంతం.. మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన కోబ్రా యూనిట్ లోని కమెండో అయిన ఇతని పేరు సచిన్ సావంత్ అట. తన సొంత పట్టణమైన బెళగావి లో ఉంటున్నాడు. ఏదో పని మీద ఇతగాడు మాస్క్ ధరించకుండా వెళ్తుంటే పోలీసులు అడ్డుపడి ప్రశ్నించారని, అయితే వారి పట్ల సచిన్ దురుసుగా ప్రవర్తించాడని తెలిసింది. దీంతో పోలీసులు అతడిని కొట్టి ఇలా సంకెళ్లు వేసి నేల మీద కూచోబెట్టినట్టు సమాచారం. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తమ కమెండో పట్ల పోలీసుల అమానుషంపై సీఆర్ఫీఎఫ్ అధికారులు కర్ణాటక డీజీపీ లేఖ రాస్తూ .. పోలీసుల  తీరుపై మండిపడ్డారు. అయితే ఈ రాష్ట్ర డీజీపీ కూడా స్థానిక పోలీసుల నుంచి వివరణ తెప్పించుకున్నారని, చివరకు ఈ వ్యవహారం పోలీసులకు, సీఆర్ఫీ దళాలకు మధ్య కోర్టు వివాదంగా మారిందని తెలుస్తోంది.