కరోనాపై కేంద్రం గుడ్ న్యూస్..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. కరోనాపై కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సోకి కోలుకున్న వారి నుంచి కరోనా తిరిగి వ్యాప్తి చెందడం లేదని

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. కరోనాపై కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సోకి కోలుకున్న వారి నుంచి కరోనా తిరిగి వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్ చేసి ఇతరులను కాపాడాలని, ఇందులో మరే సందేహాలు పెట్టుకోనవసరం లేదని సూచించారు. దీంతో ఈ విషయంపై నెలకొన్న భయాందోళనలు తొలగినట్లైంది.
కాగా.. చైనా వూహాన్‌తో పాటు అనేక యూరప్ దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ సోకుతోందని, మిగతా వారికి వ్యాప్తి చెందుతుందనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారినుంచి ఇప్పట్లో కోలుకోలేమనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే ప్రపంచ దేశాల పరిస్థితులకు భిన్నంగా భారత్‌లో కరోనా సోకి కోలుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని కేంద్రం స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం రోజురోజుకూ పెరగడం కూడా భారత్‌లో సానుకూల సంకేతమే.
[svt-event date=”27/04/2020,6:18PM” class=”svt-cd-green” ]
Stigma should be addressed through an intensive campaign. We’ve to understand that there is no risk of transmission from recovered patients. They, in fact, can be a potential source of healing for antibodies using plasma therapy: Lav Aggarwal, Joint Secretary, Ministry of Health pic.twitter.com/1LnhJaLrsq
— ANI (@ANI) April 27, 2020
[/svt-event]



