Covid vaccination: టీకా కోసం క్యూ కడుతున్న టీనేజర్లు.. దేశంలో మరింత స్పీడ్‌గా వ్యాక్సినేషన్..

|

Jan 03, 2022 | 2:23 PM

టీనేజర్స్‌కు టీకా పంపిణీ..15నుంచి 18ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్‌..దేశవ్యాప్తంగా పిల్లలకు టీకా పంపిణీ ఓ యజ్క్షంలా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ మరింత స్పీడందుకుంది. ఇవాల్టి నుంచి 15 నుంచి 18ఏళ్ల వయసు కలిగిన టీనేజర్స్‌కు టీకా పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కోవిన్ పోర్టల్‌లో 12 లక్షలకు పైగా పిల్లలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. వీరందరికీ కొవాగ్జిన్ టీకాను మాత్రమే వేస్తున్నారు. తొలి డోసు వేసుకున్న 4 వారాల తర్వాత సెకండ్ డోస్‌ వేస్తారు. స్కూల్స్‌, […]

Covid vaccination: టీకా కోసం క్యూ కడుతున్న టీనేజర్లు.. దేశంలో మరింత స్పీడ్‌గా వ్యాక్సినేషన్..
Covid Vaccination For Teena
Follow us on

టీనేజర్స్‌కు టీకా పంపిణీ..15నుంచి 18ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్‌..దేశవ్యాప్తంగా పిల్లలకు టీకా పంపిణీ ఓ యజ్క్షంలా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ మరింత స్పీడందుకుంది. ఇవాల్టి నుంచి 15 నుంచి 18ఏళ్ల వయసు కలిగిన టీనేజర్స్‌కు టీకా పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కోవిన్ పోర్టల్‌లో 12 లక్షలకు పైగా పిల్లలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. వీరందరికీ కొవాగ్జిన్ టీకాను మాత్రమే వేస్తున్నారు. తొలి డోసు వేసుకున్న 4 వారాల తర్వాత సెకండ్ డోస్‌ వేస్తారు. స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు టీకాలు పొందేందుకు వీలుగా..మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు.

ఇక ఏపీలోనూ టీనేజర్స్‌కు టీకా వేస్తున్నారు. పిల్లలకు వ్యాక్సిన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలంగాణలో మొత్తం1014 కేంద్రాల్లో 15-18 ఏళ్ల యువతి, యువకలకు ఇవాళ్టి నుంచి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు.. దేశంలో వారం రోజుల్లోనే కరోనా కేసులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చన్నారు.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించింది కేంద్రం. జనవరి 10 నుంచి బూస్టర్‌ డోస్‌కు ఏర్పాట్లుచేస్తోంది. ముందుగా సీనియర్‌ సిటిజన్స్‌, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోస్‌ అందించనున్నారు.

ఇవి కూడా చదవండి: Indian Railways: కరోనా మహమ్మారిలో తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టికెట్ల ద్వారా రూ.511 కోట్ల ఆదాయం..!

Driving Licence: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలా..? మీకో గుడ్‌న్యూస్‌.. ఇంట్లోనే ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలాగంటే..!