Delhi Corona Cases: దేశ రాజధానిలో కరోనా టెర్రర్.. ఫోర్త్ వేవ్ తప్పదా..? ప్రమాద సంకేతాలు

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటం అధికార యంత్రాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి.

Delhi Corona Cases: దేశ రాజధానిలో కరోనా టెర్రర్.. ఫోర్త్ వేవ్ తప్పదా..? ప్రమాద సంకేతాలు
Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2022 | 11:45 AM

Corona Fourth Wave: కరోనా ఫోర్త్‌వేవ్ టెన్షన్ పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ముప్పు ముంచుకొస్తోంది. ఢిల్లీ NCRపరిధిలో 15రోజుల్లోనే 500శాతం పెరిగిపోయింది వైరస్‌ వ్యాప్తి. ఆదివారం ఒక్కరోజే 517 కేసులు నమోదయ్యాయి. గత రోజు కంటే ఇది 12 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 20తర్వాత ఇవే అత్యధిక కేసులు. కేసు పాజిటివిటీ రేటు సైతం 4.21కు పెరిగింది. ఢిల్లీలో కేసులు పెరిగిపోతుండటంతో కరోనా కట్టడికి ఇవాళ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించనుంది ఢిల్లీ సర్కార్. ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశం అవ్వనున్నారు. భౌతిక దూరం, కరోనా ఆంక్షలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఢిల్లీ పాఠశాలల్లోనూ  కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో.. అధికారులూ కట్టడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరపనున్నారు. జలుబు(Cold), దగ్గు, జ్వరం(Fever) వంటి కరోనా లక్షణాలు ఉంటే స్కూల్‌కు రావొద్దని స్టూడెంట్స్‌కు సూచిస్తున్నారు. ఢిల్లీ మొత్తం కేసుల సంఖ్య 18 లక్షల 68 వేల 550కు చేరుకున్నాయి. ఢిల్లీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 9 వేల 662 బెడ్స్ కోవిడ్ రోగుల కోసం అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 9 వేల 156 కోవిడ్19 ఆక్సిజన్ బెడ్స్, 2 వేల 174 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఇక 1246 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నట్టు ఢిల్లీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ, కోల్‌కతా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం విధించింది. కరోనా కేసుల కారణంగా ఈ నెల 24వరకు రద్దు విమానాలను రద్దు చేసింది. హాంకాంగ్‌ వెళ్లే ప్రయాణికులకు కోవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరిచేసింది. మరోవైపు చైనాలో కొవిడ్‌ పంజా విసురుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్నాయి కేసులు. కరోనా కట్టడికి షాంఘైలో లాక్‌డౌన్‌ విధిస్తున్నా వైరస్‌ విజృంభిస్తూనే ఉంది. షాంఘైలో లాక్‌డౌన్‌ తర్వాత కొవిడ్‌తో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

Also Read: Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!